ఏలూరులో....
జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు sd జబీర్, వైవీహరీష్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏలూరు వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో , జిల్లా ఉపాధ్యక్షులు కే సోమశేఖర్, సీనియర్ నాయకులు ఎస్ కే బాబ్జి, మిల్టన్ ప్రతాప్, జర్నలిస్టులు జయరాం,సజ్జి , సిహెచ్ ప్రతాప్,నాగేశ్వరరావు ఎస్.కె అఖిల్, శరత్ బాబు,కళ్యాణ్,సత్యనారాయణ,శ్రీనివాస్,సతీష్, సిహెచ్ శ్రీనివాస్,సన్నీ, మౌనిక, నవీన్, కే ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించండి
‘మీకోసం’లో జిల్లా కలెక్టర్‌కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల వినతి
శ్రీకాకుళం : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి.భీమారావు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలని, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే జర్నలిస్టు వృత్తిలో ఉన్నందున అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులు, ఆరోగ్య బీమా అందించాలని, మీడియ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీలను పునరుద్ధరించాలని ఈ కమిటీలలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏలకు స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీని, గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికబీమా జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు. రైళ్లలో రాయితీ కొనసాగించాలని, ఏసీ బస్సుల్లో రాయితీ కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సమాచారశాఖకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నర్సింగరావు, ఉపాధ్యక్షుడు డి.నందికేశ్వరరావు, నరసన్నపేట నియోజకవర్గకమిటీ అధ్యక్షుడు కంగు మన్మథరావు, ఏపీబీజేఏ ఉపాధ్యక్షుడు ఎం.ప్రసాదరావు, జిల్లా ప్రతినిధులు శేఖర్, శివశంకర్, ఆర్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా
జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించండి.. APWJF డిమాండ్
జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా APWJF కలెక్టర్ కు వినతి పత్రం
జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ కు వివరించిన APWJF నాయకులు
ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించాలంటూ.. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తోంది. జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకుని.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రెండు జిల్లాల కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వివరించారు.
అనంతపురంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు షఫీ, ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ఆధ్వర్యంలో ఇన్ ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేపటి రామాంజినేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యబీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలన్నారు. జర్నలిస్టుల ఇంటిస్థలాల కేటాయింపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత,, ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీహార్ తరహాలో మనరాష్ట్రంలోని జర్నలిస్టులకు 15వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తైనా ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 6వ తేదిన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించి.. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు..
ఈ కార్యక్రమంలో APWJF నాయకులు జయప్రకాష్, డాక్టర్ సూర్య, వేణుగోపాల్, విజయ్ కుమార్, సుధాకర్, బన్సీలాల్, కేశవ, దాదాపీర్ , రాజారెడ్డి, పవన్, శింగనమల ప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By