జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలి
వి వి ఆర్ ఎం 1 భీమవరంలో జెసికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
ప్రజాశక్తి - వీరవాసరం
ప్రజలకు ప్రభుత్వాలకు వారిదిగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపిడబ్ల్యూజేఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గుండా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకుని భీమవరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయి అన్నారు. తక్షణమే అర్హురైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జర్నలిస్టుల యూనియన్లను అక్రిడేషన్ కమిటీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా అకాడమీని బలోపేతం చేయాలన్నారు జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించాలన్నారు జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతపురం నాని, ఉండ్రు నరేష్, మోహన్ రావు మోహనరావు, గొట్టేటి శ్రీనివాసరావు, నెల్సన్ ,సీమకుర్తి బాలాజీ, మల్లుల జై కృష్ణ, దొంగ సత్తిబాబు ,అంజిబాబు,తదితరులు పాల్గొన్నారు
కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు
ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే
కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో, నిరసన
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు
కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
కాకినాడ, ఆగష్టు 4 : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ షన్మోహన్ కు డిమాడ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి మారాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇస్తామని జీఓ లు విడుదల చేస్తూ దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. చివరికి అక్రిడేషన్లు ప్రతీ ఏడాది ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాలలో సీనియర్ జర్నలిస్టులకు ఫెన్షన్ సదుపాయం ఇస్తున్నందున ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని, ఇప్సటికైనా జిల్లాలోని జర్నలిస్టులు అందరికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని, వెంటనే అక్రిడేషన్ల జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎండి అధికార్, జి. శోభన్ బాబు,డి శ్రీధర్, పుర్రే త్రినాధ్, నానాజీ, బాబీ, సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి పండు, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు సత్య, పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి, తుని నియోజకవర్గ నాయకులు బి. ప్రవీణ్, పడాల ప్రసాద్, లోవరాజు, తాళ్ళరేవు నాయకులు మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
గుంటూరు జిల్లా జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించిన జిల్లా విద్యాశాఖ ఆధికారి కి చిరు సత్కారం
గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిచే ప్రొసీడింగ్స్ అందించిన శుభసందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా యూనియన్ తరపున గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సువర్ణ బాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సామాజిక శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కా వారికి తోడ్పాటు అందించే విధంగా స్కూలు ఫీజు లో 50% రాయితీ కల్పిస్తూ మానవతా దృష్టితో ఈ రాయితీ అందించడం అభినందనీయమని అన్నారు. దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో APWJF గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్ మహేష్ వరదల, APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, ప్రధాన కార్యదర్శి కేశంశెట్టి శ్రీనివాస, బ్రహ్మం రవి, రాజేష్, నవీన్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By