యూనియన్లకు అతీతంగా ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు రాయితీ
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం
* డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతి
చిత్తూరు, ఆగస్టు 4 : యూనియన్లుకు అతీతంగా అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్ట్ డిమాండ్ డే ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బీ ప్రకాష్ కలెక్టర్ తో మాట్లాడుతూ .... చిత్తూరు నగరంలోని ఒక జర్నలిస్ట్ యూనియన్ సభ్యుల పిల్లలకు మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని యూనియన్ల సభ్యుల పిల్లలకు రాయితీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ అందేలా చూడాలని, 3 సెంట్ల మేర ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులపై దాడులను నివారించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్లతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని, జర్నలిస్టులపై దాడులు చేసే వారి వివరాలను పోలీస్ ఎఫ్ఐఆర్ తో సహా తనకు అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా చిత్ర నగరంలో పనిచేస్తున్న ఇల్లు లేని జర్నలిస్టులు వివరాలను తనకు అందజేస్తే తప్పకుండా వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్నా కార్యక్రమంతో పాటు, కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బిజెఏ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయచంద్ర, నీరజాక్షలు, ఉపాధ్యక్షులు కమలాపతిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు, బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శులు కుభేంద్రన్, తులసిరెడ్డి, సురేందర్రెడ్డి, సత్యంప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో ఘనంగా జరిగింది. ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు గార్ల నాయకత్వంలో జిల్లా నాయకులు కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో వున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా॥ జి. లక్ష్మీశను కలిసి జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం, మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల అవార్డులను ప్రధానం, రాష్ట్ర కేంద్రంలో వృద్ధ జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హెూం నిర్మాణం తదితర అంశాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కలెక్టర్ని కోరారు.
ఆ తర్వాత రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందుబాటులో వున్న అడిషనల్ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత గారికి, జాయింట్ డైరెక్టర్ కిరణ కుమార్ గారికి వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కృష్ణాజిల్లా మాజీ కార్యదర్శి ఖాజావలి, రాజు, చొప్పా రాఘవేంద్రశేఖర్, వైడి. ఆనంద్, మైలవరం నియోజకవర్గ నాయకులు షేక్ సల్మాన్, వీసం సురేష్ బాబు, అవుటి బాబు, మురళి, పల్లెటి కాంతారావు, చింతకాయల రాంబాబు, మంతెన శ్రీనివాసులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల, ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం అందించిన ఫెడరేషన్ నాయకులు.
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ – గుంటూరు నగర నూతన కార్యవర్గం ఎన్నిక.
ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ప్రమాణ స్వీకారం.
గుంటూరు: జూలై 25
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ గుంటూరు నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం శుక్రవారం స్థానిక ఏపీ ఎన్జీవో హోం నందు ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి గుంటూరు బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణ బాబు ,ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రెటరీ పట్నాల సాయికుమార్, గుంటూరు జిల్లా సలహాదారు రాజా,తెనాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు శ్యాంసుందర్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తోడ్పాటున అందిస్తూ జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కారం చేయటంతో పాటు వారి అభివృద్ధి అభ్యున్నతికి తోడ్పాటు అందించే విధంగా ఐక్యతతో అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన కమిటీ సభ్యులుగా నగర అధ్యక్షులుగా బలగాం ప్రమోద్ కిరణ్ , ప్రధాన కార్యదర్శిగా మెట్ట షణ్ముఖ కోశాధికారిగా అంగిరేకుల గోపి,గౌరవ అధ్యక్షులుగా కంచర్ల నాగరాజు,కార్యనిర్వాహక కార్యదర్శిగా మేకల లక్ష్మణ్,ఉపాధ్యక్షులుగా బుడ్డుల జోసఫ్ ప్రసాద్, కార్యదర్శిగా కోట సిద్దు, ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలియజేస్తూ ఆత్మీయ సత్కారం అందించారు. ఈ సందర్భంగా నూతన నగర కమిటీ అధ్యక్షులు బలగం ప్రమోద్ కిరణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేస్తామని తెలియజేశారు.తనకు ఈ పదవి అందించినా జిల్లా మరియు రాష్ట్ర కమిటీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు జహీర్,మహేష్,మణి సాగర్, ఆరుద్ర,శ్యాముల్,శివ, పొనుగుభాటి నాగరాజు,సువర్ణ రాజు,బ్రహ్మం,రవి,మురళి తదితరులు పాల్గొన్నారు
ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన. విశాఖపట్నం, జూలై 9. కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టిన సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలు రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకూ నిర్వహించిన ప్రదర్శనలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా యూనిట్ పాల్గొని సంఘీభావం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి. నారాయణ్ కార్యదర్శి జి. శ్రీనివాస్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, ఇతర నేతలు రాజశేఖర్, త్రినాథ్, మధు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసిన ఈ చట్టాలను పునరుద్దించాలని, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని నినాదాలు చేసారు.ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By