కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు
*ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన
*
14 డిమాండ్స్ తో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ
..విశాఖపట్నం ఆగస్టు 4
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్,ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కదం తొక్కారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు,, శాంతి యుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు.ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,అక్రిడేషన్లు,బీమా సదుపాయం,పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టు ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు..ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను విశాఖపట్నంలో వివరించామని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ. బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించాలని,ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని, రైల్వే పాసులు జారీ చేయాలని,జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, అక్క్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని,జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ. సాంబశివరావు,ఆర్గనైజింగ్
సెక్రెటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ వై.రామకృష్ణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, త్రినాథ్, నాయుడు, ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి నగేష్ బాబు,ఆనంద్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్,కోశాధికారి కేవీ శర్మ,సంయుక్త కార్యదర్శి బీ ప్రసాద్,కార్యనిర్వాహక సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి),వీ గణేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తున్న సందర్భంగా, సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో, పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, కు గుంటూరుజిల్లా APWJF,APBJA, అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా APWJF గుంటూరు జిల్లా జనరల్ సెక్రెటరీ పట్నాల సాయికుమార్,వరదల మహేష్ APBJA గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ బోస్క సువర్ణ బాబు,జనరల్ సెక్రటరీ కేశంశెట్టి శ్రీనివాస,రవి గుంటూరు నగర అధ్యక్షులు ప్రమోద్ జనరల్ సెక్రెటరీ షణ్ముఖ,శ్యామ్యూల్ వంశీ,శ్రీనివాస్,వెంకట సాయి,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి. మద్దయ్య యాదవ్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి, నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్, సుబ్బరాయుడు ,నరసింహారెడ్డి, బేతంచర్ల సుబ్బరాయుడు, రాకేష్, కిషోర్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By