ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబిజేఏ సంఘీభావ ర్యాలీ (APWJF- APBJA)
దేశవ్యాప్తంగా బుధవారం కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా, రాష్ట్ర కమిటీ మేరకు గుంటూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF), ఏపీబిజేఏ (APBJA) నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో జిల్లా యూనిట్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా APWJF ప్రధాన కార్యదర్శి సాయికుమార్. APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి. సువర్ణబాబు, ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్,మహేష్,శామ్యూల్, సాయి,శివ,మురళీ,అవినాష్, రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంభీరంగా స్పందించాలని, రద్దు చేసిన చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి" అని స్పష్టంగా హెచ్చరించారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఆరోగ్య భీమా సమగ్ర భీమా పథకాల కొనసాగింపునకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర సమాచార గ్రహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు సమాచార శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గం జూలై 9వ తేదీన సచివాలయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ఇంటి నిర్మాణానికి సంబంధించి సబ్ కమిటీ లోని మంత్రులను విడిగా కలిసి వారి ముందు ఫెడరేషన్ ప్రతిపాదనలను పెట్టింది. ఆ సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ను కలిసి వినతి పత్రం అందజేసింది. రాష్ట్రంలోని జర్నలిస్టుల అందరికీ ఇంటి స్థలం ఇచ్చేందుకు ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఫెడరేషన్ తన ప్రతిపాదనలు సూచిస్తూ ఈ వినతి పత్రంలో వివరించింది. ఫెడరేషన్ ప్రతినిధి వర్గములో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం డి నాథన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ వి శ్రీనివాసరావు లు ఉన్నారు.
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి
ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి- ఏపీడబ్ల్యూజేఎఫ్
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనలో భాగంగా చిత్రీకరణ నిమిత్తం వచ్చిన ఆంధ్రజ్యోతి చిత్తూరు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ జిల్లా అధ్యక్షుడు డి ప్రకాష్ డిమాండ్ చేశారు. ఫోటోగ్రాఫర్ పై దాడిని నిరసిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారుపాలెం మామిడికాయల యార్డ్ వద్ద ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ ను కొట్టడం, కెమెరాకు సంబంధించి మెమరీ కార్డుని లాక్కోవడం దారుణం అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దర్యాప్తు చేసి దాడులకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. జర్నలిస్టులో రక్షణ కోసం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఓ ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి దాడులను నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపిడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు బాలసుబ్రమణ్యం సంయుక్త కార్యదర్శి ఉభేంద్రన్, ప్రసాద్ కోశాధికారి నాగరాజు సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు మంజునాథ్, మురళి దాము, సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టుల హక్కులను కాపాడాలి
రద్దు చేసిన చట్టాలను పునరుద్దరించాలి
కార్మిక సంఘాల సమ్మెలో ఏపీడబ్ల్యూజేఎఫ్
కాకినాడ, జూలై 9:
కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బుధవారం చేపట్టిన సమ్మెలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కాకినాడ జిల్లా కమిటీ నాయకులు పాల్గొని కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్టాఫీసు నుంచి బాలాజీ చెరువు సెంటర్,జీజీహెచ్, జిల్లా పరిషత్ సెంటర్ల మీదుగా కలక్టరేట్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా యూనిట్ పాల్గొని సంఘీభావం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు కె. సత్యనారాయణ, వల్లూరి నానాజీ, పుర్రే త్రినాథ్, రాజు, మంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలతో కలిసి రద్దు చేసిన ఈ చట్టాలను పునరుద్దించాలని, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని నినాదాలు చేసారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నవీన్ రాజ్ మాట్లాడారు.
ఈ సందర్బంగా మీడియాను ఉద్దేశించి నవీన్ రాజ్, లక్ష్మణ్ మాట్లాడుతూ రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలలో మీడియాకు సంబంధించిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆక్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఆక్ట్ కూడా ఉన్నాయన్నారు.కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకె 4 లేబర్ కొడ్లను మోడీ ప్రభుత్వం తీసుకుని రావడం దుర్మార్గమన్నారు. ఇవి అమలులోకి వస్తే కార్మికవర్గం 200 ఏళ్ల వెనుకటి పరిస్థితులకు నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమంతో పాటు జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతున్నదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కార్మికులు చేసే ప్రతి ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను పునరుద్ధరించకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
రద్దు చేసిన జర్నలిస్టుల హక్కుల చట్టాలను పునరుద్ధరించాలి
- సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఖండించిన రాష్ట్ర నాయకులు మద్దిలేటి, గోరంట్లప్ప
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలను వెంటనే పునరుద్దరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు డి.హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ మద్దతు తెలిపింది. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక, ఉద్యోగ, పెన్షనర్లు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేసింది. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన 44 కార్మిక చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే పునురుద్ధరించాలని కోరారు. కార్మికుల గొంతు నొక్కడంలో భాగంగా జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందాయన్నారు. అందువల్ల జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు సునీల్ కుమార్, నగర గౌరవ అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి ఎర్రమల, సహాయ కార్యదర్శి బాబు, నాయకులు ప్రతాప్, మహ్మద్ రఫీ, పురుషోత్తం, బ్రహ్మయ్య, అనిల్ నర్సిరెడ్డి, మద్దిలేటి యాదవ్ పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By